Ticker

6/recent/ticker-posts

Telugu Real Love Stories : పదిరోజుల ప్రేమ ప్రయాణంTelugu Real love stories ( మనసులోమాట )

నాది,  ప్రేమో ఏమో నాకు తెలియదు. నా ప్రేమ ప్రయాణం ఒక ట్రైన్ లో మొదలైంది. ఇంతకీ  అది ప్రేమేనా..? నా ప్రేమ జ్ఞాపకాలు చెప్పేకంటే ముందు. నా ఒక కోరిక. మీరు కూడ మీ ప్రేమ అనుభవాలు తెలియ చేయగలరు. అని నా మనవి.


ముక్యంగ నేను చెప్పేది


నా పది రోజుల ప్రేమ ప్రయాణం. నా పేరు మోహన్. నేను ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నేను మరియు మా  తోటి ఉద్యోగులు కలిసి మా సంస్థ తరుపున ఒక జర్నీ చేయాలి అని అనుకున్నాం.   పది రోజులు బాగా సంతోషంగ ఉండాలి అనుకున్నాం. అనుకున్నట్లుగానే అందరం, ఒక ట్రైన్ ఎక్కాము. మంచి మంచి ప్రదేశాలు, చూడాలి అనుకున్నాము. మొదటగా మేము విజయవాడ నుండి నాగాలాండ్ వరకు వెళ్ళాలి. నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాను. ముక్యంగా అమ్మాయిలతో మాట్లాడాలి అంటే చాలా సిగ్గు. మొదటి రోజు సాయంత్రం అందరం ఒక భోగిలో కూర్చొని, అంతాక్షరీ ఆడుతున్నాము. ఒకరి తర్వాత ఒకరు పాట పడాలి. నావంతు వచ్చింది, నాకు పాట పాడటం రాదు. నేను పాడుతుంటే అందరు నవ్వుతున్నారు.తర్వాత వేరేవాళ్లు పాడుతున్నారు. అది ఒక అమ్మాయి గొంతు . తను పాడుతుంటే, ఒక్కసారి తన వైపు చూడాలి అనిపించింది,చూసా భలేవుంది.తనని చూస్తుంటే తను నాకు కావాలి అనిపించింది.కానీ ఇంత అందమైన అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా, అని నా అనుమానం. తను కూడా మాతో పాటి ఉద్యోగం చేస్తుంది. కానీ ఇంతవరకు తనని నేను చూడలేదు. ఇదే దేవుడు రాసిన వింత అంటే. అందుకే అంటారు పెద్దలు, అందరితో కలిసిపోవాలి అందరిలా ఉండాలి అని.మల్లి మరుసటి రోజు ఉదయం నేను చాలా తొందరగా లేచి రెడీ అయ్యాను. అప్పుడే మా భోగి లోకి కాఫీ అతను వచ్చాడు. కాఫీ తీసుకోని అ అమ్మాయి ఉన్న భోగిలోకి వెళ్ళాను. తను నిండుగా దుప్పటి కప్పుకొని తల మాత్రమే కనిపించే విదంగా ఉంది.నేను పక్క సీట్లో కాఫీ తాగుతు తనని చూస్తున్న.


అలా తనని చూస్తుంటే నా మనసులో ఎదో అలజడి, తనకి ముద్దు పెట్టాలి అనిపించింది. కానీ అలా చేస్తే నేను చెడ్డవాడిని అని తను అనుకుంటే. అందుకే నేను ఏమి చెయలేదు. మల్లి సాయంత్రం అందరం ఒక భోగిలోకి వచ్చాము. ఇసారి చెస్ ఆడుతున్నాము. నాకు చెస్ బాగా వచ్చు. నేను గెలవాలి అని అనుకున్న. అందుకే కస్టపడి గెలిచినా. తర్వాత తను నా దగ్గరికి వచ్చి, మోహన్ గారు నా చెస్ నేర్పించండి అంది.  అప్పుడు నా మనసులో ఒక పాట. గాల్లో తేలినట్లుందే, గాల్లో ఉగినట్లుందే తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అనే పాట. అప్పటి నుండి మేము ఇద్దరం మంచి  స్నేహితులయ్యం. అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయి. నాకు ఎప్పుడు తన ఆలోచనే. తనని చూడాలి. అందుకే ఏమి అవసరం లేకున్నా తను ఉన్న భోగిలోకి వెళ్లి అటు ఇటు తిరుగుతుండే వాడిని.


నేను అలా తిరగడం తను చూసి నవ్వుతుంది.


అలా నా ప్రేమ లోపలే ఉండిపోయింది. ఇంకా ఏడురోజులు ఉన్నాయి ఎలాగైనా తనకి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్న కానీ అమ్మాయితో మాట్లాడాలి అంటే నాకు దైర్యం సరిపోలేదు. తను మాత్రం నన్ను చూసి నవ్వుతుంది. అది ప్రేమనా లేకపోతే నేను జోకర్ లా కనిపిస్తున్నాన. అర్థం కావడం లేదు. మేము ఒక మంచి ప్రదేశం వెళ్ళాము. అక్కడ ఎవరికొద్ది వాల్లు తిరుగుతున్నారు. నేను మాత్రం తను ఎలా వెళితే అలా తన వెనకాలే వెళుతున్న. నేను వెళ్లిన ప్రదేశం చూడకుండా తనని చూస్తూ ఉండిపోయాను. అలా మూడురోజులు కె. నన్ని పిచ్చివాడిని చేసింది. ప్రేమిస్తున్నాను అని తను చెప్పదు, నేను చెప్పలేను.తనతో ఉన్నంత సేపు చాలా సంతోషం అనిపించింది


నాకు మాత్రం తనతో ఉన్నన్ని రోజులు గోల్డెన్ డేస్ లా అనిపించింది.ఇంకా మా ప్రయాణం అయిపోవచ్చింది . ఇంతవరకు తనతో నేను ఏమి చెప్పలేదు. మేము అందరం ఒక బస్సు లో ప్రయాణం చేస్తున్నానుము. అప్పుడే బస్సు లో, గీతా గోవిందం, సినిమా వేసాడు. నాకు నచ్చిన సన్నివేశం వచ్చింది. అదే బస్సు లో ముద్దు పెట్టుకోవడం. అ సన్నివేశం చూస్తుంటే ట్రైన్ లో తనని ముడ్డుపెట్టుకోవాలి అని నేను అనుకున్న విషయం నాకు గుర్తుకు వచ్చింది.


తనని చూస్తున్నంత సేపు ఎదో తెలియని ఒక ఆకర్షణ


 మేము తిరిగి వెళ్లాల్సిన రోజు వచ్చింది. మేము పది రోజులు చాలా సరదాగా ఉన్నాము. మాకే తెలియకుండ పదిరోజులు గడిచిపోయాయి. ఇంకా మేము ఇంటికి వెళుతున్న చివరి రోజు డిసెంబర్ 31 మేము అందరం కొత్త సంవత్సరం వేడుకలు ట్రైన్ లోనే జరుపుకుంటున్నాము. తను మాత్రం నా ముందు కుర్చొని ఉంది కానీ ఇంతవరకు నేను తనకి నా ప్రేమ విషయం చెప్పలేదు. తను వేరే ఊరికి ఉద్యగానికి వెళ్ళిపోయింది. కానీ నా మనసులో బాధ మాత్రం తిరలేదు. ఎందుకంటే ఇంతకీ తను నన్ను ప్రేమిస్తుందా లేదా....? అని అ కుందనపు బొమ్మ,మల్లి నాకోసం వస్తే బాగుండు.

Post a Comment

0 Comments