Ticker

6/recent/ticker-posts

Telugu Love Stories నా ప్రేమ మాత్రం 6 సంవత్సరాలు క్రితం మొదలైంది.


Telugu Love Stories నా ప్రేమ మాత్రం 6 సంవత్సరాలు క్రితం మొదలైంది.

Love Stories


:ఇప్పుడు అమ్మాయిలు డబ్బులు చుసి ప్రేమిస్తున్నారు. నా జీవితంలో కూడ అలానే జరిగింది. నేను మంచిగా ఉండాలి అందరితో కలిసిపోవాలి అనుకునే వాడిని. కానీ నేను ఎంత మంచిగా ఉన్న ప్రేమలో గెలవలేక పోయాను. ఇంకా నా ప్రేమ ప్రయాణం చెపుతాను. మీ జీవితంలో కూడా జరిగిన ప్రేమ సంఘటనలు తెలియ చేస్తారు అని అనుకుంటున్నా.


నా ప్రేమ మాత్రం 6 సంవత్సరాలు క్రితం మొదలైంది.


తను మా బావా అన్న కూతురు. వరుసకి అక్క కూతురు. చాలా బాగా ఉంటుంది. చాలా పొగరు ఉన్న అందగత్తె. మొదటి సారి తనని, బంధువుల ఫంక్షన్ లో చూసాను.



తను చీరలో సౌందర్య లా ఉంటుంది.


తనని చీరలో చూడగానే పడిపోయా. గట్టిగ పట్టుకొని ముద్దు పెట్టుకోవాలి, అని నా మనసులో అనిపించింది కానీ అలా చేస్తే నేను అంతే.అప్పటి నుండి తన మీద ఇష్టం పెరిగింది. ఎవరిదైనా బంధువుల ఫంక్షన్ ఉంది అంటే తను వస్తుందా..? రాధా..? అనే సమాచారం తెలుసుకునే మరి వెళ్ళేవాడిని. అలా రెండు ఫంక్షన్ లు లో చూడటమే సరిపోయింది. తనకు ప్రొపోజ్ చేయాలి అనుకున్న. నా అందృష్టం ఏమో నాకు తెలియదు. తన తన నెంబర్ చాలా తొందరగా సంపాదించాను. తనకి వాట్సాప్ లో మెసేజ్ చేయడం మొదలు పెట్టాను. కానీ తను రిప్లయ్ ఇవ్వలేదు. పిచ్చ కోపం వచ్చింది. ఆన్లైన్ లో ఉండి కూడ నాకు రిప్లయ్ ఇవ్వవా నీకు ఇంకా మెసేజ్ చేయను. అని మెసేజ్ చేశాను.అప్పుడు సమాధానం ఇచ్చింది.


ఇంకా అప్పటి నుండి మాట్లాడటం మొదలు పెట్టాము.


 నా వివరాలు అన్ని తెలుసుకుంది. తన గురించి కొంచం మాత్రమే చెప్పింది. మేము కల్సుకోవాలి అంటే బంధువులు ఫంక్షన్ ల లో బాగా మాట్లాడు కునే వాళ్ళము. ఇలా ఒక రోజు తనకి నా ప్రేమ విషయం చెప్పాలి అని అనుకున్న. తను లేదు  ఎక్కడ ఉంది అని వేరే వాడిని అడుగుతే తను ఊరు వెళ్ళిపోయింది అని తెలిసింది. తన కోసం బస్టాండ్ దగ్గరికి వెళ్ళాను.అప్పటికే తను ఊరికి వెళ్లింది. తన నెంబర్ నా దగ్గర ఉంది కదా అనే ధీమా నాది.



ఇంకా తనకి వెంటనే మెసేజ్ చేశాను.


చాలా తొందరగా సమాధానం ఇచ్చింది. మల్లి వస్తాను అని చెప్పింది. తన గురించి వివరాలు తెలుసుకుందాం అని అడిగితె తన వివరాలు మొత్తం చెప్పింది. ఇంకా తను హాస్టల్ లో ఉంటూ చదువుతుంది. అని చెప్పింది. తన హాస్టల్ దగ్గరికి వెళ్ళాను. ఇలా ప్రతి ఆదివారం బాగా కలుసుకునే వాళ్ళము.నా చదువు అయిపోయింది. ఇంట్లో ఉంటూ జాబ్ కోసం చదివే వాడిని. ఇంకా రోజులు ఫోన్ లో మాట్లాడు కునే వాల్లము. తను తన ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను అని చెప్పింది. తనకి నేను అంటే చాలా ఇష్టం అని అనిపించింది.మా నాన్న గారు మా ఇంటికోసం, నా చదువు కోసం, చాలా అప్పుచేసారు. అప్పులు ఎక్కువ కావడం వల్ల మా పొలం అమ్మి. అప్పులు మొత్తం తీర్చాము.మేము పొలం అమ్మిన విషయం మా బంధువులు అందరికి తెలిసింది. అలాగే నేను ప్రేమించిన అమ్మాయికి కూడ తెలిసింది.



రోజు మేము ఫోన్ లో గంటలు తరబడి మాట్లాడు కునేవాళ్ళము.


రాను రాను తను నాతో మాట్లాడటం తగ్గించింది. ఎందుకు అలా చేస్తున్నావు అంటే, నాకు పని ఉంది అందుకే అలా చేస్తున్నాను అని, తప్పించుకుంది. సరే లే అని నేను కూడ తనకి ఫోన్ చేయడం తగ్గించాను. ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తోంది. అనే నమ్మకం నాకు. ఫోన్ లు, పక్కన పెట్టి జాబ్ కోసం వెతకడం మొదలు పెట్టాను. ఇలా ఉండగా నేను ఇంటికి పివాల్సి వచ్చింది. ఇంకా మల్లి ఇంటి దగ్గరఉండి చదువుకుంటున్న. తనతో మాట్లాడాలి అనిపిస్తే వాల్ల ఊరు వెళ్ళేవాడిని. ఇంతలా ప్రేమించే నాకు అనుకోకుండా ఎదురు దెబ్బ తగిలింది. మా ఇంటికి, దూరపు బందువు ఒక ఆయన వచ్చాడు. నా లవర్ ని తన కొడుక్కి ఇచ్చి పెళ్లిచేయాలనీ మాట్లాడాను అని మా నాన్న తో చెప్పాడు.



నేను నమ్మలేదు ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తుంది కదా...?


 అనే గుడ్డి నమ్మకం. తను కూడ ఏ రోజు చెప్పలేదు. ఇలా సంబంధాలు చూస్తున్నారు అని. తన మీద చాలా కోపం వచ్చింది. కానీ నేను ఏమి చెయలేదు. ఉండలేక ఒకరోజు అడిగాను. నీకు ఇలా పెళ్లి సరిపోయింది అంట కదా..? అని తను అవును అని దిట్టుగా నాకు సమాధానం చెప్పింది. మరి నన్ను చేసుకోవా...? అంటే. నీకు జాబ్ లేదు కదా, మీకు ఉన్న ఆస్తి అంత అమ్మేసారు కదా ఇంకా ఏముంది నిన్ను పెళ్లి చేసుకోవడనికి. తను మా ఆస్తి చుసి నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు తెలిసిపోయింది.
ఇంకా తనని చూస్తుంటే చెడ్డ చిరాకు అనిపింస్తుంది. నన్ను చుసి ప్రేమిస్తుంది అనుకున్న, నా ఆస్తి చూసి ప్రేమిస్తుంది. ఇంక తనతో కాంటాక్ట్ అన్ని తీసేసా. తను ఎలా ఉందొ కూడ పట్టించుకోవడం మానేస. ప్రేమించే తప్పుడు.

జాగ్రత్తగా ప్రేమించండి. నాలాగా మోసపోకండి.


Post a Comment

0 Comments