Ticker

6/recent/ticker-posts

Love stories : తనని చూస్తుంటే నాకు అలా అనిపించలేదుఎందుకు అలా చేసావు : Telugu love stories

Real Love Stories :


మాది ఒక పేద కుటుంబం నేను కాలేజ్ ఇల్లు తప్ప నాకు ఏమి తెలియదు. ఇంకా నేను నా అవసరాలు కోసం హోటల్ లో సర్వర్ గ పని చేస్తాను. ఇలా ఉన్న నాకు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అది ఏమిటో చెప్పే ముందు నాదొక విన్నపం. మీరు కూడా ఎవరినైనా ప్రేమించి ఉంటే మీ ప్రేమను కూడా. ఇ లవ్ స్టోరీ. క్లిక్ స్వాతి న్యూస్ ద్వారా మాకు తెలియ చేయండి.

మాది ఒక మండలం నేను డిగ్రీ చదువుతున్నాను


నేను ప్రతి రోజు బస్సు ప్రయాణం చేయాలి మాకు కాలేజ్ కి దాదాపు 26 కిలోమీటర్లు ఉంటుంది. నేను సాయంత్రం కాలేజ్ నుండి వచ్చిన తర్వాత హోటల్ లో పని చేయడానికి వెళతాను. నేను డిగ్రీ కాలేజ్ చేరిన నెల తర్వాత బస్సు లో ఒక సంఘటన జరిగింది. బస్సు మొదటగా మా ఊరికి వచ్చి తర్వాత వేరే ఊరుమీద కాలేజ్ కి వెళుతుంది. నేను ఒకరోజు కాలేజ్ కి పోలేదు. మరుసటి రోజు కాలేజ్ పోదామని నేను మా ఫ్రెండ్స్ బస్సు ఎక్కాము. అక్కడ బస్సు కొంత దూరం పోయాక ఒక స్టాప్ దగ్గర బస్సు నిలబడింది. ఒక అవ్వ బస్సు ఎక్కింది. మేము కూర్చున్న ముందు సీట్లో ఒక అమ్మాయి పైకి లేచి అవ్వకు సిటు ఇచ్చింది. నేను మొదటసారి అ అమ్మాయిని చూసాను. ఎవర్రా తను అని మా ఫ్రెండ్ ని అడిగితె, తను మన క్లాస్ రా కొత్తగా చేరింది నిన్న, నిన్న నీవు రాలేదు కదా అందుకే నీకు తెలియదు.బాగా చదువుతుంది కానీ కొంచం పొగరు అని అన్నారు.


కానీ తనని చూస్తుంటే నాకు అలా అనిపించలేదు


 అని, మా ఫ్రెండ్స్ కి చెప్పాను. మేము కాలేజ్ కి వెళ్ళాము. తను తన ఫ్రెండ్స్ తో ఉంది నేను మా ఫ్రెండ్స్ తో ఉన్నాను. కానీ తనతో మాట్లాడాలి అనిపించింది. ఎలాగైనా తనతో మాట్లాడాలి అని, బయటకి వచ్చి వెంటనే క్లాస్ లోకి వెళ్లి, ఈరోజు సార్ రాలేదు అని తనతో చెప్పి, వాల్ల ఫ్రెండ్స్ తో కూడ చెప్పాను. ఇంకా ఎవరికొద్ది వాల్లు మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా మా సార్ వచ్చాడు. అందరిని చెడబడా తిట్టాడు. అప్పుడు తను కోపంగా నా వైపు చూసింది. అలా కోపంగా తను నా వైపు చూసినప్పుడు ఎదో తెలియని ఫీలింగ్ నాలో కలిగింది. మరుసటి రోజు తను నా దగ్గరికి వచ్చి నిన్న ఎందుకు అలా చేసావు అని అడిగితే, నీతో మాట్లాడాలి అనిపించింది, అందుకే అలా చేశాను అని చెప్పాను. అప్పుడు తను, ఒక నవ్వు నవ్వి వెళ్లింది. అప్పటి నుండి మేము బాగా కలిసిపోయాము. ఒకరికొకరం సహాయం చేసుకునే వాల్లం. తను చాలా రిచ్ ఫ్యామిలీ. మాది మాత్రం పేద కుటుంబం.


ఒకరోజు తనకి నా ప్రేమ విషయం చెప్పాను


తను వెంటనే ఓకే చెప్పింది. కానీ, మాది చాలా పేద కుటుంబం. ప్రేమలో గెలవాలి అంటే, డబ్బులు ఉండాలి, అంతే కాదు, మాది వేరే వేరే కులం. ఇంకా మేము ఫోన్ లోనే బాగా మాట్లాడుకునే వాల్లం. ఒకరోజు వాల్ల ఇంట్లో వాల్లు అందరు. ఒక ఫంక్షన్ కి వెళ్లారు అని చెప్పింది. ఆరోజు రాత్రి చాలా సేపు మాట్లాడుకున్నాం. అలా ఆరోజు తనతో రాత్రి మాట్లాడి నందుకు. ఒకరోజు ఎక్కువగా హోటల్ లో పని చేయవలసి వచ్చింది.

మాది డిగ్రీ అయిపోయింది.


ఇద్దరం ఎవరి ఇళ్లకు వాల్లం వెళ్ళాము. మేము ప్రేమ పెళ్లి చేసుకోవాలి అంటే డబ్బులు కావాలి కదా అని చాలా సేపు అలోచించి. ఒక ఆలోచన వచ్చింది. ముందుగా మా నాన్నకి ఒక చిన్న వ్యాపారం పెట్టించాలి అని, పెట్టించాను. బాగా నడుస్తుంది. కానీ నేను జాబ్ చేయాలి కదా, జాబ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం.  అని. కోచింగ్ పూర్తి చేసుకొని జాబ్ కోసమే వెతకడం మొదలు పెట్టాను. అప్పుడే తనకి పెళ్లి సంబంధం చూడటం మొదలు పెట్టారు అని. నాతో చెప్పింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇ ఆలోచనలో పడి జాబ్ కోసం వెళ్లిన. సెలెక్ట్ కాలేక పోయాను. కొద్దీ రోజుల్లోనే. వాల్ల అమ్మమ్మ చనిపోయారు అప్పుడు ఒక సంవత్సరం వరకు తనకు సంబంధాలు. చూడరు అని. చాలా సంతోషం అనిపించింది. జాబ్ విషయం లో పడి తనతో మాటలు తగ్గించాను. తను నా మీద ద్వేషం పెంచుకుంది. నాతో మాటలు తగ్గించింది. జాబ్ కోసం నాతో మాట్లాడవా అంటు అలిగింది మల్లి తనే మెసేజ్ చేస్తుందిలే అనుకున్న కానీ చెయలేదు. ఇప్పుడు మంచి జాబ్ ఉంది కానీ తను లేదు. నీవు రావాలి అని కోరుకుంటున్నాను. చెలి.


చాలా మంది ప్రేమిస్తారు


 కానీ తమ ప్రేమని ఇతరులకు చెప్పలేరు. మీరు మీ జీవితంలో మీ ప్రేమ కోసం ఎన్నో రకాల ట్రిక్స్ వాడి ఉంటారు. అలాంటి ట్రిక్స్ మా లవ్  స్టోరీ లో పంచుకోండి. మీరు వాడిన ట్రిక్స్ చాలా మందికి ఉపయోగపడుతుంది. 

Post a Comment

0 Comments