Ticker

6/recent/ticker-posts

నా మరదలికి నేను నచ్చలేదు కానీ


 My love story in telugu నా మరదలికి నేను నచ్చలేదు

 కానీ తను అంటే నాకు పిచ్చ ఇష్టం. తను సూపర్ గ ఉంటుంది. నేను కొంచెం నల్లగా ఉంటాను. తనకి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు కానీ తనతో ఉన్నపుడు మాత్రం చాలా అంటే చాలా సంతోషం గ ఉండేవాడిని. దేవుడు చేసే వింతను చూసి అ దేవుడిని బండ్డ బూతులు తిట్టాను.అంతేకదా..? మీరు కూడ నా స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమించకుంటే ఎంత బాధగా ఉంటుందో.నా లవ్ ఎలా మొదలైందో మిరే చుడండి.

నా ప్రేమ మొదలైనప్పుడు నా వయసు 16 సంవత్సరాలు అప్పుడు నేను 10 th చదువుతున్న. నా మరదలు 9th చదువుతుంది. మాది సిటీ. నమరదలు వాళ్ళది ఒక పల్లెటూరు. పల్లెటూరు అనగానే అమ్మాయిలు బలే ఉంటారు. ఒకరోజు మా మామ వాళ్ళకి డబ్బులు ఇచ్చిరామ్మని మా అన్న చెప్పాడు. సరే అని నేను వెళ్ళాను. ఇంటి దగ్గర ఎవరు లేరు కానీ డోర్ మాత్రం తెరిచే ఉంది. నేను అలానే ఇంట్లోకి వెళ్ళాను. లోపలికి వెళ్లి చూస్తే నా కళ్ళతో నేను నమ్మలేనిది చూసాను. నా మరదలు పిల్లా బట్టలు మార్చుకుంటుంది. ఒకటే పరుగు బయటకి తీసాను. నన్ను నేను చాలా సేపు తిట్టుకున్నా. బయటకి వచ్చాక చాలా భయం వేసింది. వాల్ల నాన్న కి చెపితే ఏమి జరుగుతుందో అని. నేను బయటే కూర్చున్న. చాలా సేపు తర్వాత వాల్ల నాన్న ఇంటికి వచ్చాడు. ఎంత సేపు అయింది రా వచ్చి ఏమి నీవు బయటే ఉన్నావు అన్నాడు.నాకు మాత్రం గుండె లోపల దడ దడ కొట్టుకుంటుంది


ఎక్కడ చెపుతుందో అని కానీ చెప్పలేదు. తను ఎందుకు చెప్పలేదా..? అని ఆలోచిస్తే, నేను తనని చూసాను కానీ తను నన్ను చూడలేదు. ఇది తెలుసుకోవడానికి నా మట్టి బుర్రకి ఇంతసేపు పట్టింది. తను నా వైపు చూసి ఒక నవ్వు నవ్వింది. అప్పుడు నాకు dj పాట పెట్టుకొని డాన్స్ వేయాలి అనిపించింది.అప్పుడు నేను వచ్చిన విషయం మర్చిపోయా. మా మామనే డబ్బులు అడిగాడు. మామకి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వచ్చేసా. ప్రతి ఒక్కరికి ప్రేమ అనే గాలి తగులుతుంది అంట అది నిజమే. తనని అలా చూసినప్పటి నుండి మల్లి వాల్ల ఇంటికి పోవాలి అనిపించేది.


ఎటువంటి కారణం లేకుండ పోలేను కదా..?

 నావి పదవ తరగతి పరీక్షలు అయిపోయాయి. నేను ఇంటర్ కాలేజ్ కి చేరాను. మా కాలేజ్ వాల్ల ఊరికి దగ్గర్లోనే. నాకు తనని చూడాలి అనిపించింది. నాకే తెలియకుండ  నేను మా ఫ్రెండ్స్ దగ్గర కమెడియన్ అయ్యాను. ఎందుకో మిరే చుడండి. కాలేజ్ బంకు కొట్టి నా మరదలు వాల్ల ఊరికి వెళ్లి వచ్చాను. ఎరా..? సారు ఏమి చెప్పాడు ఈరోజు అని అన్నాను. ఒరేయ్ వెదవ ఈరోజు ఆదివారం రా  అన్నారు. అప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వలేక పోయారు. ఇంతకీ నా మరదలు వాల్ల ఊరిలో ఏమి జరిగిందో చెప్పలేదు కదా..? తనకోసం వెళ్ళాను కానీ తను  లేదు. ఎక్కడికి వెళ్లిందో తెలియదు వెనక్కి వచ్చేసా.తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని నా మనసులో అనిపించింది. తనకోసం ఎదురు చూడటం లో ఒక సంవత్సరం గడిచిపోయింది.

తను ఇంటర్ కోసం మా సిటీ లో చేరింది

 అక్కడ ఒక హాస్టల్ లో ఉంటుంది. తను అక్కడ చేరింది అని నేను మా సిటీ లోనే ఒక కాలేజ్ లో చేరాను. ఇంటి దగ్గర నుండి కాలేజ్ కి వెళ్లడం మొదలు పెట్టాను. ప్రతి ఆదివారం తనకోసం తను ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఒక రోజు హాస్టల్ కి సెలవులు ఇచ్చారాని తను మా ఇంటికి వచ్చింది. ఏమి అదృష్టమో కదా..? తనతో మాట్లాడాలి అంటే కొంచెం భయ్యం అనిపించింది. అలాగే చిన్నగా తనతో పరిచయం అయింది.ఇద్దరం ప్రతిరోజు సాయంత్రం బయటికి పోయి పాణి పూరి, చికెన్ పకోడా, వంటివి ఎదో ఒకటి తిని వచ్చేవాళ్ళము.తనకోసం మా ఫ్రెండ్ ది బైక్ తీసుకోని వచ్చేవాడిని. నాకే తెలియకుండ తన మీద ప్రేమ పెంచుకున్న. తను మా ఇంటికి వచ్చినప్పుడు, తనకే తెలియకుండ తనవి చిన్న ఫొటోస్ రెండు తీసుకున్న. తనకి నా నేను ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్పాలి అని చాలా ప్రయత్నం చేశాను.

ఒకసారి నా దగ్గర తన ఫొటోస్ ఉన్న విషయం తనకి తెలియాలి అని తనకి కనిపించే విదంగా పెట్టాను.

అప్పుడు తన కి ఇచ్చేసాను

ఎందుకు నాకు తెలియకుండ నా ఫొటోస్ పెట్టుకున్నావు అని అడిగింది. అప్పుడు తన కి ఇచ్చేసాను ఫొటోస్. అయినా కూడ తను నా ప్రేమను అర్థం చేసుకోలేక పోయింది.నా ప్రేమ కథ ఇంకా ఉంది.

నేను తర్వాత పేజీలో చెప్తాను. నా లవర్ కి నా ప్రేమ విషయం తెలియాలి అనే నేను ఇలా రాస్తున్నాను.


Post a Comment

0 Comments