Ticker

6/recent/ticker-posts

ఇలా ఉన్న నా జీవితంలో కి అనుకోకుండా..?

 

ఇలా ఉన్న నా జీవితంలో కి అనుకోకుండా..? ( Telugu bad love )


ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటో రెండో ట్విస్ట్ లు ఉంటాయి. మరి నా జీవితంలో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి. మీతో నాభాధ పంచుకుంటే,కొంచమైనా తగ్గుతుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను.

నా పేరు దురదృష్టం చాలా కొత్తగా ఉంది కదా..?


 నిజానికి అ పేరు నేనే పెట్టుకున్న. అసలు పెరుకన్నా ఇ పేరే నాకు బాగా గుర్తువుంది. నేను పుట్టగానే మా నాన్న కి దురదృష్టం మొదలైంది. మాకు చాలా ఆస్తి ఉండేది. నేను పుట్టాక చాలా ఆస్తి పోయింది.నేను ఏ పని మొదలు పెట్టిన జరగదు. ఇప్పటికే మీకు అర్థం అయింది అనుకుంటా..? jr ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో చెప్పారు కదా, జీవితం ఎవరిని వదిలి పెట్టదు అని, అందరికి సరదా తీరుస్తుంది. అని చెప్పారు. అందరికి ఏమో గాని నాకు మాత్రం బాగానే సరదా తీర్చింది.


చిన్నపుడు నేను పుట్టాక ఆస్తి పోయింది


 మా నాన్న
అమ్మ, నన్ను దురదృష్ట వంతుడు అనేవాళ్ళు. ఇంట్లో ఏమి చెడు జరిగిన నన్నే అనేవాళ్ళు. విల్లు అనేమాటలు నాకు చాలా కోపం తెప్పించేవి కానీ నేను ఏమి చేయలేను కదా..? ఇంట్లో వాల్లు మరి. ఇలా ఉన్న  నా జీవితంలో అనుకోకుండా. మా పక్కింట్లో కి ఒక అమ్మాయి వచ్చింది. తనకోసం నేను ఇంటి పైకి వెళ్ళేవాడిని. ఉదయాన్నే తను వాల్ల ఇంటి పైకి వచ్చేది. ఒకరోజు నేను మెడ మీద పడుకున్న. చాలా ఆలస్యంగా లేచాను. తన మొఖం చూసాను చాలా మంచి జరిగింది. అప్పటి నుండి తనవేంట పడటం మొదలు పెట్టాను. కానీ తనకు నేనంటే ఇష్టం లేదు.


తను ఒక ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తుంది.


 ప్రతిరోజు ఉదయాన్నే వెళుతుంది. తను బయలుదేరే సమయానికి నేను బయటికి వెళ్లి తనకి లైన్ వేసేవాడిని.తను నా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వేది. తను నన్ను ప్రేమిస్తుంది అనుకున్న. ఒకరోజు తనకి నా ప్రేమ విషయం చెప్పేసాను. నా దురదృష్టం గురించి చెప్పాను కదా మీకు. తనకి నేను నచ్చలేదు అంట. తనకు నేను నచ్చకపోయిన, నేను మాత్రం తనని చూసేవాడిని. ఇప్పుడున్న అమ్మాయిలకి ప్రభాస్, మహేష్ లాంటి వాల్లు కావాలి. నేను కొంచెం బాగానే ఉంటాను. ఒకరోజు మా పెద్దనాన్న కూతురుతో అవసరం వచ్చింది ఫోన్ చేశాను. అప్పుడు ఒక అమ్మాయి ఫోన్ లీఫ్ చేసింది. తన గొంతు భలే ఉంది.  ఎవరు మాట్లాడేది అని అన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి అంది. నేను, లక్ష్మి అక్క ఉందా..? అని అడిగాను.చిన్న పని ఉంటే వేరే ఊరు వెళ్లింది అనింది.


ఇంకా తనకి నేను పరిచయం చేసుకున్న.
నా పేరు ఊరి పేరు అన్ని చెప్పేసాను.

అమ్మాయి : ని పేరు చాలా సార్లు విన్నాను కానీ నిన్ను ఎప్పుడు చూడలేదు.

అంది.
నేను : నేను వేరే ఊరిలో ఉంటాను మా సొంత ఊరికి చాలా తక్కువ గ వెలుతాను.
అమ్మాయి : నేను మీకు తెలుసా..?
నేను : ని పేరు తెలియదు కానీ, నీవు హాస్టల్ లో చదువుతున్నావు అని తెలుసు. నీకు ఒక తమ్ముడు ఉన్నాడని తెలుసు.
అమ్మాయి : అవును నేను హాస్టల్ లో ఉంటాను. నాకు జ్వరం వచ్చింది. అందుకే ఇంటికి వచ్చాను.
నేను : మరి ఎలావుందీ ఇప్పుడు.
అమ్మాయి : బాగానే ఉంది. ఏమి చేస్తుంటావ్ నీవు
నేను : చదువు అయిపోయింది జాబ్ కోసం చూస్తున్న అని అన్నాను.
మీ అమ్మా వచ్చాక నాకు ఫోన్ చేయమను అని చెప్పి పెట్టేసా. ఇంకా మాట్లాడాలి అనుకున్న కానీ, నా దరిద్రం గుర్తుకు వచ్చింది. నేను మాట్లాడిన విషయాలు అక్కకు చెపుతాంది. అక్క నా గురించి చెడుగా అనుకుంటే అని పెట్టసా.


మరుసటి రోజు పక్కింట్లో


అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. నా ప్రేమను అంగీకరించి సరే అంది. దరిద్రం పోయింది అనుకున్న. కొన్ని రోజులకే వాల్ల ఇంట్లో తెలిసి తనని జాబ్ మనిపించారు. అప్పటిదాకా  బాగా చాటింగ్ చేసుకునే వాల్లము. తను నాకు కాల్ చేసి చెప్పింది. నీవు నన్ను మర్చిపో ఇంట్లో వాల్లకి మనం ప్రేమించుకోవడం ఇష్టం లేదు అంది. నా దరిద్రం గురించి నాకు తెలుసు కానీ పాపోమ్ పక్కింటి అమ్మాయి కి తెలియదు కదా..?


రెండు రోజుల తర్వాత


మా లక్ష్మి అక్క ఫోన్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తనే అని నాకు తెలుసు.
చిన్నగా తనతో బాగా చాటింగ్ చేసేవాడిని.  ఇంత చాటింగ్ చేస్తున్న నాకు తను ఎలా ఉంటుందో ఇంతవరకు తెలియదు. ఒకరోజు తన ఫొటోస్ సెండ్ చేయమన్నాను. కానీ రిప్లై రాలేదు. అలా తనతో మాట్లాడక నెల దాటింది. ఇంతవరకు తను మెసేజ్ చెయలేదు. ఇంటి దగ్గర ఉందా..? లేకపోతే హాస్టల్ పోయిందా..? నాకు అస్సలు తెలియదు.

తను నాతో ఎప్పుడు మాట్లాడుతుందో అని ఎదురు చూస్తున్న.


చూసారు కదా నా దరిద్రాన్ని. ఒకవేల నాలాంటి వాడు ఇంకొకడు కనిపిస్తే, నాలాంటి వాడు కానీ ఇంకొకడు ఉన్నాడ అని ఒక చిరునవ్వు నవ్వుతా అంతే.Post a Comment

0 Comments