Ticker

6/recent/ticker-posts

ఇది నా ప్రేమకథ 2


MY LOVE STORY ఇది నా ప్రేమ కథ 2

మొదటి భాగము నేను ముందే చెప్పాను. ఒకవేల మీరు చదవ కుంటే చదవండి. మీరు ప్రేమించే అమ్మాయి కి మీ ప్రేమను చెప్పడానికి భయం వేస్తె. తన మీద ప్రేమను మరియు మీ మనసులోని భావాలను. రియల్ లవ్ స్టోరీ ద్వారా తెలియచేయండి.

మల్లి మొదలైంది 

తర్వాత తను వాల్ల ఇంటికి వెళ్లింది. తనకు కొత్తగ వాల్ల నాన్న మొబైల్ తీసిచ్చాడు. మొబైల్ తీసుకున్న రెండురోజుల తర్వాత నాకు మెసేజ్ చేసింది ఎలా ఉన్నావు అని. అప్పుడు నాకు తెలియలేదు. నేనే బావా అంటు పేరు మెసేజ్ చేసింది. అప్పటి నుండి బండి మల్లి లవ్ పట్టాలా మీదకు వచ్చింది. నేను పది మెసేజ్ లు చేస్తే తను రెండు మెసేజ్ లు చేసేది. చూసారా..? అమ్మాయిలు ఎలాంటి వాల్లో. అదే అమ్మాయిలు పది మెసేజ్ లు పెట్టి మనం రెండు మెసేజ్ లు పెడితే మన తలకాయ తినే వాల్లు కదా..? అయినా కూడ నేను బాధ పడలేదు ఎందుకంటే తను నాతో చాటింగ్ చేస్తుంది చాలు అని అనుకునే వాడిని. తనకి ఇంటర్ మొదటి సంవత్సరం సెలవులు అయిపోయాయి. తను మల్లి కాలేజ్ కి వెళ్లింది. ఇసారి తను హాస్టల్ లో లేదు. తను మరియు తన స్నేహితులు కలిసి ఒక రూమ్ ని బాడుగకి తీసుకున్నారు. మొబైల్ తనతోనే తీసుకోని పోయింది. తను రూమ్ కి వెళ్ళాక నాకు ఫోన్ చేసింది. తను ఫోన్ చేసింది అని చాలా సంతోషపడ్డాను. కానీ తను తన మొబైల్ కి డబ్బులు వేపించుకోవడానికి నాకు ఫోన్ చేసింది.

దీనమ్మ, డబ్బులు


దీనమ్మ, డబ్బులు ఎక్కించాక. ఇంకా నాకు ఫోన్ చెయలేదు. నేనే తనకు ఫోన్ చేశాను. కాలేజ్ అయిపోయాక నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు ఒకసారి రా అలా బయటకు పోయాద్దాము అంది. తన రూమ్ కి మాకు దాదాపు పది కిలోమీటర్లు ఉంటుంది కానీ ప్రేమ అంటే ఎన్ని కిలోమీటర్లు అయినా పోవచ్చు కదా..? అందుకే మా స్నేహితుడి బైక్ తీసుకోని వెళ్ళాను. కానీ తను ఉండే రూమ్ కి దూరంలో ఆపమని చెప్పింది. లవర్ ని కదా ఆమాత్రం ఉంటుంది. నిజానికి నేను మాత్రమే తనని ప్రేమిస్తున్న. తను ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు. తను బయటకి వచ్చింది అలా వెళ్లి ఫుడ్ సెంటర్ దగ్గరికి పోయి తిని మల్లి తనని రూమ్ దగ్గర విడిచి పెట్టాను. తను బైక్ మీద కూర్చొని నా బుజము మీద చెయ్ వేసుకొని ఉంటే నాకు మాత్రం జీవితాంతం అలానే ఉండాలి దేవుడా.. అని అనిపించింది. నేను ఇంటికి వచ్చాను. ఆరోజు రాత్రి తను నా పక్కన ఉన్నట్లు ఉంది. తనే ఎక్కువగా గుర్తుకు వస్తంది.

Im see WhatsApp status 


సరేలే అని మొదట అందరి వాట్సాప్ స్టేటస్ లు చూసాను. తర్వాత తన స్టేటస్ వచ్చింది. మంచి రొమాన్స్ పాట పెట్టింది. సరే పిట్ట వేడి పాట పెట్టింది కదా అని, వాట్సాప్ లో మెసేజ్ చేశాను. తను సమాధానం ఇవ్వలేదు. మల్లి చేశాను. ఏమైనా పని ఉందా..? అని అడిగింది ఏమిలేదు నీతో మాట్లాడాలి అనిపించింది అందుకే చేశాను అన్నాను. ఇంక నెట్ ఆఫ్ చేసింది. సరే నిద్రపోయిందేమో అని. నేను కూడ ఆఫ్ చేసి పడుకున్న. మరుసటి రోజు ఉదయాన్నే,

శుభోదయం మిత్రమా. అంటు మెసేజ్ చేసింది. రాత్రి నిద్ర ఫుల్ గ వచ్చింది అందుకే నీకు సమాధానం ఇవ్వలేక పోయాను అంది.

My love life continued 

సరే ఏమి కాదులే అన్నాను. అలా ప్రతిరోజు తనకోసం వెళ్ళేవాడిని. ఖర్చు నేనే పెట్టె వాడిని. తనకి నచ్చిన ఫుడ్ ని తీసుకోని అలా బయటికి వెళ్లి తినేవాళ్ళము. ఒక అబ్బాయితో అమ్మాయి అన్ని విషయాలు పంచుకుంటుంది అంటే అది ప్రేమే కదా..? అందుకే తనకి నా ప్రేమ విషయం చెప్పాలి అన్నాను. తనని నేను ప్రెస్తున్న అంటే తను ఏమి చేస్తుందో తెలుసుకోవాలి అనుకున్న. అందుకే ఇద్దరం బయట ఉన్నపుడు అడగాలి అని. అలా బయట తింటూ ఉన్నాము. చిన్నగ మాటల్లో పెట్టి. నీకు ఎలాంటి వాడు కావాలి అని అన్నాను.


అందరి అమ్మాయిల లాగనే తను కూడ.తను ఏమి చెప్పిందో మిరే చుడండి.


నా మరదలు :

1) ప్రభాస్ లాగ ఉండాలి.

2)ఆస్తి ఎక్కువ లేకున్నా పర్వాలేదు. కానీ, మంచి బైక్ ఉండాలి.

3) నెలకి 50 k అన్న రావాలి.


ఇవి తను పెట్టిన షరతులు ఇంక చెప్పింది కానీ నాకు గుర్తుకు లేవు. నాకు గుర్తుకు ఉన్నవి మాత్రమే చెప్పాను 

తన షరతులకి అక్కడ ఉండలేక పోయాను. సరే వెల్దాము పదా. నాకు ఇంటి దగ్గర కొంచెం పని ఉంది అని అక్కడి నుండి చిన్నగా వెళ్ళిపోయాను.


ఇంకా ఉంది...


మీకు ఇన్ని షరతులు పెట్టె అమ్మాయి లవర్ గ ఉంటే తప్పకుండ  కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది అలాంటి అమ్మాయిలు ఉన్నారో తెలుసుకోవాలి అని ఉంది.


Post a Comment

0 Comments