Ticker

6/recent/ticker-posts

ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే చెప్పేయండిఎవరినైనా నిజంగా ప్రేమిస్తే చెప్పేయండి

 పల్లెటూరు అబ్బాయిలను, అమ్మాయిలు ప్రేమిస్తారా...? ఇది నా ఆలోచన మాత్రమే ఎందుకంటే నా ప్రేమ విషయం చెప్పలేక పోయాను. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే చెప్పేయండి, చెప్పకుండా ఉంటే మిరే నష్టపోతారు. నాపేరు ms రాజు, పేరుకి రాజు మేము రాజులం కాదు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎందుకు దూరం అయిందో మీకు చెప్తాను.

మాది ఒక పల్లెటూరు

చుట్టూ పొలాలు, పచ్చని పంట చేలు, చాలా అందంగా ఉండేది మా ఊరు. కానీ మా ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చింది. నేను మా ఊరు లోనే పది వరకు చదువుకున్నాను. నాకు చాలా ఇష్టమైన స్నేహితులు ఉన్నారు. అలాగే మంచి మనుషులు ఉన్నారు. కానీ జాబ్ కావాలి కదా....? అందుకే చదువు కోసమే వేరు ఊరు వెళ్ళాను. అక్కడ ఎంబీఏ చేయవలసివచ్చింది. అందుకే హైదరాబాద్ వచ్చాను. అక్కడ మనుషులు అందరు చాలా తేడాగా ఉన్నారు.అందరు ఎవరికీ నచ్చినట్లు వాల్లు ఉన్నారు. వాల్ల డ్రెస్ స్టైల్, హెయిర్ స్టైల్, వాల్లు మాట్లాడే భాష అంత కొత్తగా ఉంది. అందరు ఇంగ్లిష్ లో చక చక  మాట్లాడుతున్నారు. నాకు ఒక్క ముక్క ఇంగ్లిష్ రాదు. ఎవరితో మాట్లాడుదాం అన్న భయం. నేను ఒక రూమ్ రెంటికి తీసుకున్నాను. నేను కాలేజీ కి మొదటి రోజు వెళుతున్నాను.రూమ్ లో రెడీ అయ్యాను. బస్టాండ్ కి వెళ్ళాను. మాములుగా అందరు కాలేజ్ కి, స్కూల్ కి, పోయేవాళ్లు, అంటే ప్రతి రోజు బస్సు కానీ, ట్రైన్ కానీ, జర్నీ చేసేవాళ్ళు. పాస్ తీసుకుంటారు. కానీ నేను మొదటి రోజు కదా నాకు ఏమి తెలియదు.నేను బస్టాండ్ కి వచ్చాను


నేను ఎక్కవలసిన బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఒక అందమైన అమ్మాయి నేను ఉన్న చోటికి వచ్చింది. తనని చూస్తుంటే. నాకు ఎదో తెలియని సంతోషం. హైదరాబాద్ వచ్చింది చదువుకోవడానికి, కానీ ప్రేమ అంటూ తిరగడానికి కాదు అని మనసులో అనుకునే వాడిని. నేను ఎక్కవలసిన బస్సు వచ్చింది. నేను ఎక్కాను. ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. నేను చుసిన అమ్మాయి కూడ అదే బస్సు ఎక్కింది. ఎక్కడ తను దిగుతుందో అని తన వైపు చూస్తూ ఉన్నాను. తను మాత్రం దిగలేదు. నేను దిగవలసిన స్థలం వచ్చింది. తనని మిస్ అవుతున్నాను అనుకున్నాను. తనుకూడా దిగింది. నేను మా కాలేజీ ఉన్న వైపు వెళుతున్నాను. తను వస్తుంది. ఇంకా నా వాల్ల కాలేదు. తను ముందు వెళ్ళాక నేను వేన కాలే వెళ్దాం అనుకున్న. తన వెనక వెళ్తున్న. నా లక్ అదే. తను మా కాలేజ్. నాకు మా రూమ్ తెలియదు వేరే వాల్లను అడిగి క్లాస్ కి వెళ్ళాను.
నేను వెళ్లే సరికి తను మా క్లాస్ లో ఉంది


ఏందిరా ప్రపంచంలో అదృష్టవంతుడు నేనే అనుకున్న. సైలెంట్ గ వెళ్లి చివరిలో కూర్చున్న. తన వెనకాల ఉండి తనని చూస్తున్నాను. తన ఉంగరాలు జుట్టు. నాకు తెగ నచ్చింది. తన జుట్టును, మొఖం మీద పడకుండ సరి చేసుకుంటే బలే ఉంది అమ్మాయి. తను ఎవరితో ఎక్కువగా మాట్లాడదు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అలా కొద్దిరోజులు గడిచింది. తనతో మాట్లాడాలి అనిపించింది. చాలా ట్రై చేశాను. తన గురించి వివరాలు సేకరించాను. తను మా ఫ్రెండ్ లవర్ రూమెట్ అని తెలిసింది. నేను తనని ఇష్టపడుతున్న విషయం మా ఫ్రెండ్ కి చెప్పాను. మిగితా స్టోరీ వాడే నడిపాడు. మేము ఇద్దరం ఒక చోట కలిసేలా చేసాడు. అక్కడ ఒక చిక్కు వచ్చింది.
నేను అమ్మాయితో మాట్లాడాను

తనతో ఎలా మాటలు కలపాలి అని ఆలోచిస్తున్న. అంతలో తనే నాతో మాట్లాడింది. తను నాకు ఇచ్చిన షాక్ ఏంటి అంటే తను నన్ను ఇంతవరకు చూడలేదు అంట. నీవు మా క్లాస్ నా అని అడిగింది. అప్పుడు తనకు మిగితా స్టోరీ అంత చెప్పాను. తనని బస్టాండ్ లో చుసిన దగ్గరి నుండి ఇప్పటి వరకు చెప్పాను. మరుసటి రోజు నుండి నా వైపు చుసిన నవ్వడం మొదలు పెట్టింది. ఎందుకో నాకు తెలియదు. చిన్నగా మాది ఒక బ్యాచ్ అయింది. అందరం చాలా సంతోషం గ, ఉండేవాళ్ళము. కొన్ని రోజుల తర్వాత అందరు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. మేము ఇద్దరం లవర్స్ అనుకునే వాల్లు తను నా లవ్ ని ఒప్పుకుంది అనుకునే వాల్లు. కానీ తనకి నా ప్రేమ విషయం చెప్పలేదు. అందరు తనని కూడ అలా అనే వారు. తను నా దగ్గరికి వచ్చి నీవు నన్ను ఇష్టపడుతున్నావా..? అని అడిగింది. లేదు అని చెప్పాను. అవును అని చెప్పింటే బాగుండు.


ఒకరోజు తనకి ప్రొపోజ్ చేద్దాం అని వెళ్ళాను


కానీ తను నాకు షాక్ ఇచ్చింది. తను వేరే వాడిని ప్రేమిస్తున్నాను అని నాతో చెప్పింది నాకు. మెంటల్ వచ్చింది. వాడు నీకు సరిపోడు అని చెప్పాను.నేను నిన్ను చాలా సార్లు అడిగాను,నీవు నన్ను  ప్రేమిస్తున్నావా అని. నీవు ఏమి సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు, ఇలా అంటున్నవ్ అంటూ.తను నా నుడి కోపంగా వెళ్లింది.ఇంత వరకు తను ఎలా ఉందొ కూడ నాకు తెలియదు. తనతో మాట్లాడాలి అని ఉంది.మీ ప్రేమ విషయాలు మాతో పంచుకోవాలి అనుకుంటే

వాట్సాప్ 9542116574 కి పంపండి.


Post a Comment

0 Comments