Ticker

6/recent/ticker-posts

అందుకే తనకి నా ప్రేమ విషయం చెప్పాలి అనిపించింది


అందుకే తనకి నా ప్రేమ విషయం చెప్పాలి అనిపించింది


అందరికి నమస్తే ఫ్రెండ్స్ నాపేరు విజయ్ నా లైఫ్ లో జరిగిన సంఘటనలు గురించి మీతో పంచుకోవాలి అనిపించింది. అందుకే చెపుతున్న. మీరు ప్రేమించే వాల్లు దూరం అయ్యారు అని బాధ పడకండి. ఎందుకంటే నా జీవితం కూడా అలా జరిగింది. నేను ఎంతగానో ప్రేమించే నా ఫ్యామిలీ దుఃఖం లోకి వెళ్ళింది. మీతో నా అనుభవాలు చెపుతున్న.


నాపేరు ముందే చెప్పానుఇంకా నా స్టోరీ ఇదుగో ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ అంటే నాకు పిచ్చి ప్రేమ, ఇంట్లో నేనే పెద్దవాడిని. నాకు ఒక బంగారు చెల్లమ్మ ఉంది. అలాగే, నన్ను ఎంతగానో ప్రేమించే నా తల్లిదండ్రులు, తాత, నానమ్మ, విల్లె నా జీవితం కానీ, దేవుడు మాత్రం నాజీవితం మర్చి వేసాడు. కష్టాలు అందరికి వస్తాయి, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది బాగా తెలుసుకోవాలి. మా ఇంట్లో అందరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. నేను చెప్పింది ఇంట్లో ఎవరు కాదు అనరు. నేను ఏది కావాలి అంటే అది నాకు ఇచ్చే, నా  బంగారు అమ్మ. చిన్న చిన్న గొడవలు పడే నా చిన్ని చెల్లి. నాకు నెలకు ప్యాకెట్ మని బాగా ఇచ్చేవాళ్ళు. ఇలా ఉండే నా లైఫ్ మారింది. మా అమ్మ కి ఆరోగ్యం బాగాలేదు. ఇలా చాలా రోజులు జరిగింది. ఇంట్లో ఆనందం దూరం అయ్యింది. సడెన్ గ. మా అమ్మ చనిపోయింది. ఇల్లు మొత్తం చీకటి కమ్ముకుంది. ఎప్పుడు సరదాగా ఉండే నా జీవితం లో దుఃఖం రావడం మొదలైంది. చెల్లి చిన్న పాప కావడం వల్ల ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ తను మా కోసమే రెండో పెళ్లి చేసుకున్నాడు.వచ్చిన పిన్ని కొన్ని రోజులు బాగా ఉంది


తర్వాత అసలు కథ మొదలైంది. చిన్న చిన్న దానికి ఇంట్లో గొడవలు. అసలు ఏమి జరుగుతాందో అర్థం కావడం లేదు. మా పిన్ని నన్ను చెల్లిని చూసుకోవడం మానేసింది. నాన్న ఏమి చేయలేడు. అందుకే ఇంట్లో గొడవలు. ఇలాంటి గొడవలు మధ్య ఇంట్లో ఉండటం చాలా కష్టం అనిపించింది. డిగ్రీ చదువు అయిపోయింది. ఎమ్ బీఏ లో చేరాను. నా అదృష్టం ఏమో నాకు తెలియదు కానీ. నా అదృష్టం ఇక్కడే మొదలు అయింది మల్లి. ఇంట్లో గొడవలు ప్రశాంతత లేదు అని క్లాస్ రూమ్ లో విచారంగా కూర్చున్నాను. అప్పుడు ఒక అమ్మాయి రూమ్ లోకి వచ్చింది తను నా క్లాస్. తను అందరితో సరదాగా ఉండేది. ఎవరైనా బాధలో ఉంటే తన మాటలతో నవ్వించేది. నేను మాత్రం తన వైపు చూసే వాడిని కాదు. అందరూ నవ్వుతు ఉన్నారు ఇలా కొద్దిరోజులు గడిచాక తను నన్ను చూసింది. నేను మాత్రం చాలా విచారంగా ఉన్నాను కారణం, అమ్మ చనిపోయింది, నాన్న రెండో పెళ్లి చేసుకొని చాలా బాధ పడుతున్నాడు, నా చిన్న చెల్లి, దీనికి తోడు ఇంట్లో ప్రతిరోజూ గొడవలు.వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను


 తన పేరు చెప్పలేదు కదా..? తన పేరు సుమలత ( పేరు మార్చాము ) ఇంతలో తను అనుకోకుండా నా దగ్గరికి వచ్చింది, ఏంటి బాబు ఎప్పుడు చూసిన ఇలా విచారంగా ఉంటావు, అందరితో మాట్లాడు అని అంది. నాకు చాలా కోపం వచ్చింది. నోరుమూసుకుని వేళ్ళు, అస్సలు ఎవరు నువ్వు, అని అన్నాను. నేను అన్న మాటలకూ తను ఏడవడం మొదలు పెట్టింది. ఎందుకంటే తను ఇంతవరకు ఎప్పుడు ఏడవడం నేను చూడలేదు. మరుసటి రోజు తనని చూస్తే జాలి అనిపించింది. నేనే తన దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. తను చాలా సింపుల్ గ. పర్వాలేదు అంది. ఇలా తన కోపం తగ్గింది. జీవితంలో నేను పడుతున్న బాధలు తనకి చెప్పాను. నా మా ఇంట్లో జరిగిన అన్ని విషయాలు తనతో చెప్పేవాడిని . చిన్నగ నాకు దగ్గర అయింది. అంతే కాదు నాకోసం ఇంటి నుండి బాక్స్ కూడ తెచ్చేది. అప్పుడు తనలో మా అమ్మ ను చూసుకున్నాను.తను జీవితాంతం నాతోనే ఉండాలి అనిపించింది


అందుకే తనకి నా ప్రేమ విషయం చెప్పాలి అనిపించి. ఒక మంచిరోజు కోసం ఎదురు చూసా. మంచి రోజు వచ్చింది. అదే అందరికి నచ్చిన రోజు, ప్రేమికుల రోజు, తనకి నా ప్రేమ విషయం చెప్పాను. తను మాత్రం ఒక వారం తర్వాత ఓకే చెప్పింది కానీ, ఇంట్లో వాల్లను బాధ పెట్టాను. అని చెప్పింది.నీవే ఇంట్లో వాల్లను ఒప్పించి అని చెప్పింది. నా చదువు పూర్తి అయ్యాక చెపుదాం అని, చూసా తనకు సంబంధాలు చూడటం నాకు తెలిసి, నేనే వెళ్లి వాల్ల ఇంట్లో వాల్లను అడిగాను. నా అదృష్టం వాల్లు సరే అన్నారు, కానీ జాబ్ వచ్చాకే పెళ్లి అని చెప్పారు. మంచి జాబ్, మంచి జీవితం మల్లి నాకు దక్కాయ్, అందుకే చెపుతున్న. ఒకటి పొతే ఇంకొకటి మనకు తప్పకుండ వస్తుంది.మీ అనుభవాలు కూడ ఇలా పంచుకోవాలి అంటే

వాట్సాప్ 9542116574
దీనికి మెస్సేజ్ చేయండి చాలు.

Post a Comment

0 Comments