Ticker

6/recent/ticker-posts

మాటలు లేకుండ సినిమాలు తీసే మాత్రికుడి గురించి


మాటలు లేకుండ సినిమాలు తీసే మాత్రికుడి గురించి


 మాటలు లేకుండా సినిమాలు తీయగలిగే మహానటుడు. ప్రపంచంలో అద్భుతమైన వాడు. మహా మాయగాడు గురించి మనం తెలుసుకుందాం. ఇతడు చేసే విన్యాసాలు మాములుగా ఉండవు. అందరిని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్విస్తాడు. రచయిత, గాయకుడు, యుద్దానికి వెతిరేకి. మహా శాంతి ప్రియుడు మన చార్లీ చాప్లిన్, మరి అయన ఎలాంటి వాడు ఆయన జీవితం ఏంటి తెలుసుకుందాం. మాటలు లేకుండా నవ్వించ గలవారు. ప్రపంచంలో ఇద్దరు, వారిలో మొదటి వాడు, చార్లీ చాప్లిన్, రెండవ వాడు mr బీన్,

 మొదటగా చార్లీ గురించి తెలుసుకుందాం.పుట్టినరోజు    = 1889 ఏప్రిల్ 16
ప్రదేశం - ఇంగ్లాండ్
తల్లిదండ్రులు       =  హన్నా, చార్లెస్
వారు ఇద్దరు కూడా నటులు
చార్లీ తండ్రి ఎక్కువగా తాగేవాడు, వీరు నటనతో వచ్చిన డబ్బుతో తాగడానికి ఎక్కువగా వాడే వాడు.చార్లీ తన జీవితం అంత చాలా కష్టాలు పడ్డాడు. తండ్రి బాగా తాగడం వల్ల వారి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అంతే కాదు కొన్ని రోజులకే వాల్ల తండ్రి వదిలేసి వెళ్ళాడు, మరి కొన్నాళ్ళకే చనిపోయాడు. మరి కొద్దిరోజుల్లోనే చార్లిన్ తల్లిగారికి మతి చలించింది. ఆమె కు చికిత్స చేపించడానికి ఆసుపత్రిలో చేరిపించాడు.


ప్రతి ఒక్కరికి ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది


అలాగే చార్లికి కూడా. చార్లీ కేవలం 3 వ సంవత్సరం లోనే మిమిక్రి చేయగలిగాడు. అంతే కాదు ఒకసారి. అతడి తల్లి బదులు పాట కూడ పాడాడు. అతడి రంగస్థలం మొదలు అయింది. చిన్నావయసు నుండి కష్టాలు పడుతూ వచ్చాడు. అంతలోనే 11 సంవత్సరాలు గడిచి  పోయాయి. అతడి పరిస్థితి చాలా గోరంగా తయారు అయింది. తినడానికి, ఉండటానికి కూడా అతడికి స్థలం లేదు. కానీ అతని జీవితం లో మార్పు లేదు. తినాలి అంటే కూలి పని చేయాలి, ఉండాలి అంటే పార్క్ లలో ఉండాలి, వేరే దారి లేదు.అతడి జీవితం మారడం మొదలు అయింది. చిన్నగా అతడికి నటనలో అవకాశాలు రావడం ప్రారంభించాయి.

మొదటగా ఒక ఆఫీస్ బాయ్ గ అవకాశం వచ్చింది.


చిన్నగా మంచి నటుడు అనిపించుకున్నాడు. 1904 లో చార్లీ కి మంచిగ పేరు వచ్చింది.అతడి అభిమానులు పెరగడం ప్రారంభించినారు.ఒక కంపనిలో నటుడుగా చేరాడు అంతే కాదు దాని ద్వారా మంచి మంచి ప్రదేశాలు లో. తనకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.చార్లీ అభిమానికి మంచి స్టూడియో ఉంది, అంతే కాదు అప్పటికే ఆ స్టూడియో అతను ఎన్నో సినిమాలు తీసాడు.

చార్లిన్ నెలకు 50 డాలర్లు తీసుకునే వాడు.


కానీ అతని అభిమాని మాత్రం 150 డాలర్లు చార్లికి ఇచ్చేవాడు.చార్లీ కిస్టోన్ సినిమాలు ఎక్కువగా నిర్మించాడు. 1914 అంత కూడా ఇ సినిమాలు చాలా ఎక్కువ తీసాడు.
చార్లిన్ కున్న గొప్ప విద్య ఏంటో తెలుసా...? మాటలు లేకుండ సినిమాలు తీయగలడు, అది అతని గొప్పతనం.అతడికి ఇంకో మంచి పేరు ఉంది. అదే మూగ సినిమాల చక్రవర్తి. అతడివి మొత్తం చిత్రాలు 35 అన్ని చాలా తొందరగా రిలీజీ అయినాయి. మొదటి చిత్రం. చిత్రాలు విడుదల అయినా వివరాలు.1914 -ఫిబ్రవరి 2,7,9 అంతే కాదు ఒక సంవత్సరం లో 35 సినిమాలు చేసాడు.చార్లికోసం ఒక కంపని కూడా ముందుకు వచ్చింది.ఒక సంవత్సరం లోనే. అతడికి అభిమానులు పెరిగారు.1915 లో భారీ పరితోషికం వచ్చింది ఏకంగా 1240 డాలర్లను ఇస్తాను అంటూ ఒక కాంపని ముందుకు వచ్చింది.


అంత లోనే మల్లి మంచి ఆఫర్ వచ్చింది


వారానికి 10 వేల డాలర్ల ఆఫర్ అంటూ ఒక కంపని ముందుకు వచ్చింది.అంత జీతం అంతే ఇంతవరకు హాలీవుడ్ చరిత్రలోనే ఎవరు తీసుకోలేదు.అతడు చేసిన నటనికికేవలం 3 సంవత్సరాలకే. ప్రపంచం అంత తెలిసిపోయాడు. 1918 లోనే ఒక కంపని చార్లీ తో భారీ ఒప్పందం చేసుకుంది.కేవలం 18 నెలలకే 8 చిత్రాలను తీయాలాంటూ ఏకంగా 10 లక్షల డాలర్లను అందించింది.చార్లీ తర్వాత ఎక్కువ సినిమాలు తీయలేక పోయాడు. 30 సంవత్సరాలు అయినా కూడా కేవలం 9 చిత్రాలు మాత్రమే చేసాడు.  చార్లీ కి అభిమానులు ఎక్కువ.చార్లీ చివరిగా తీసిన చిత్రం.ఏ కింగ్ ఇన్ న్యూయార్క్.

చార్లీ మామూలోడు కాదు


హాస్య నటనలో ఆరి తెరాడు. చార్లీ తనకంటూ ఒక పాత్రను సిద్ధం చేసుకున్నాడు. అతడు మనల్ని నవ్వించాలి అంటే  మాయాజాలం అవసరం లేదు. అతని దగ్గర ఉన్న వి ఉంటే చాలు. అది అతడి చేతి కర్రా, బిర్రుగా ఉండే కోటు. నల్లని షూస్, ఒక టోపీ ఇవే అతడి మాయలోక ప్రపంచం.అతడు సృష్టించుకున్న పాత్రకి, పేరు ఉండదు, ఏది  నచ్చితే అది చేసుకుంటూ వెలుతాడు.అతడు తీసిన హాస్యాలను చాలా మంది కాపీ కొట్టారు. కేవలం అతడి మొఖం, మరియు అతడి నడవడిక వంటివి ద్వారా అందరిని నవ్వించే మాయగాడు.చార్లీ తన జీవితం మొత్తం హాస్యనికే అంకితం చేసాడు. ప్రపంచంలో లో ఎక్కడ చుసిన. మన హాస్య నటుడే.

ప్రపంచాన్ని మార్చిన ఏకైక వాడు మన చార్లీ గారు.


Post a Comment

0 Comments