Ticker

6/recent/ticker-posts

బాగా వాడుకొని వదిలేసాడు


బాగా వాడుకొని వదిలేసాడు


 ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది కానీ, ఆ ప్రేమ మాదలైన క్షణాలు వేరు అలా నా జీవితం లో కూడా ప్రేమ ప్రయాణం జరిగింది మరి. నా ప్రయాణం ఎలా జరిగింది. నా అనుభూతులు మీతో పంచుకోవాలి అనుకున్న అందుకే నా జీవితంలో జరిగిన విషయాలు చెపుతున్నాను. ఇప్పుడు ఉన్న రోజుల్లో నిజాయితీగా ప్రేమించే వారు చాలా తక్కువ. ఎక్కువ మంది నటించే వాళ్లే.కానీ మనల్ని ప్రేమించేవాళ్ళు మన పక్కన ఉంటే చాలు.

నిజంగా ప్రేమించేవాళ్ళు మన మనసులో ఏముందో తెలుసుకో గలరు.


 ప్రేమించి మోసం చేసేవాళ్లను చూసాను, నిజంగా ప్రేమించిన వాళ్ళను చూసాను. ఇక నాగురించి చెపుతాను.

Naa life and love story 


నా పేరు రాణి ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన పెద్ద బహుమతి నా తల్లిదండ్రులు ఎందుకంటే నాకు ఏమి తక్కువ కాకుండ చూసుకునే వాళ్ళు నాకోసం వాల్లు  ఏమైనా చేసేవాల్లు, అలాంటి తల్లిదండ్రులు అందరికి ఉండరు మరి. అలాంటి వాళ్ళకి నేను మంచి బహుమతి ఇవ్వాలి కానీ చెడు బహుమతి కాదు, అందుకే వాల్లతో ఎప్పుడు సరదాగా ఉండే దాన్ని, కానీ నా లైఫ్ ఉన్నట్లుండి మారిపోయింది. ఒక పరిచయం నన్ను నా జీవితాన్ని మార్చింది. ప్రతిరోజులాగా ఒకరోజు వెళుతున్నాను అప్పుడు చిన్నప్పుడు నాతో కలిసి చదివిన స్నేహితుడు  నాకు మల్లి పరిచయం అయ్యాడు. తను ఎవరో  మల్లి నాకు గుర్తు చేసాడు. తను చెప్పేవరకు నాకు ఏమి గుర్తు రాలేదు.అలా తను మల్లి నాకు పరిచయం అయ్యాడు


చిన్ననాటి స్నేహితుడే కదా అని నేను అతడితో రోజు మాట్లాడుతూ ఉండే దాన్ని. అలా చాలా సంతోషంగా ఉండేవాల్లం. కానీ అతడి నడవడిక లో మార్పు కనిపించింది. అందుకే అతడితో మాట్లాడటం తగ్గించాను. ఇద్దరం అన్ని విషయాలు పంచుకునే వాల్లం. ఇంకా అతడితో మాట్లాడటం తగ్గించాక ఒకరోజు నాతో ఎదో చెప్పాలి అని రమ్మన్నాడు. నేను సరే లే అని వెల్లాను. అప్పుడు నాకు లవ్ ప్రొపోజ్ చేసాడు.తనకు నేనంటే ఇష్టం అని స్కూల్ సమయంలో నుండి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అసమయం లో ఏమి చేయాలో తోచలేదు. నాకు కొంచం టైమ్ కావాలి.  అని అతడికి చెప్పాను. సరే అన్నాడు. ఇక్కడ అతను చెప్పిన విషయం విని నాకు చాలా వింతగా అనిపించింది. చినప్పటి నుండి ఒకరు ప్రేమించడం, నాకోసం వెతకడం, నాకోసమే మా కాలేజ్ కి రావడం నన్ను ఆశ్చర్యం కు గురించేసింది.


ఒకరోజు తనకి ఒకే చెప్పేసాను.


 నాకోసం ఏమైనా చేసే తల్లిదండ్రులు నా ప్రేమను అంగీకరిస్తారు అని. మేము ఇద్దరు, బాగా తిరిగాం. ఇది లేదు అని అనకూడదు అలా తిరిగాం మేము. ఒకరోజు నా తల్లిదండ్రులు కు ప్రేమ విషయం చెప్పాలి అని ఇంటికి వెళ్ళాను రాత్రి అందరు భోజనం చేసాక. చెప్పేసాను నేను నా చిన్ననాటి స్నేహితుడిని ప్రేమిస్తున్నాను అని. వాల్లకు నా ప్రేమ అస్సలు అర్థం కాలేదు. ప్రతి ఇంట్లో జరిగినట్లే మా ఇంట్లో కూడా పెద్ద గొడవ జరిగింది కానీ అంతటితో ఆగలేదు. నాకు మంచి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఒకరోజు నన్ను చూడటానికి పెళ్ళికొడుకు వాల్లు కూడా వచ్చారు. ఇదే విషయం. నేను తనకి చెప్పను. తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. మన పెద్దలను ఎలాగైనా ఒప్పించి పెళ్లిచేసుకుందాం అని చెప్పాను. కానీ అప్పుడే నాకు ఊహించని సమస్య  ఎదురు అయింది. అప్పుడు తను నా వైపు చూస్తూ, నేను నిన్ను ప్రేమించలేదు. అని అన్నాడు. అంతే కాదు. తన అవసరం కోసం నన్ను పూర్తిగా వాడుకున్నాడు అని బాగా అర్థం అయింది.


ప్రేమించాలి అనే ఉద్దేశం లేదు అని చెప్పాడు.


 అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక నాకు చావు మాత్రమే శరణ్యం అనిపించింది. కానీ నేను చనిపోదాం అనుకునే సమయంలో మా అమ్మ నన్ను కాపాడింది. నీకు సంబంధాలు చూసినట్లు నటించాం తల్లి, వాడు ఎలాంటి వాడో నీకు తెలియాలి అని అన్నారు. చూసావ్ కదా. నీవు చనిపోయే అంత తప్పు చేయలేదు. ఇంత మాత్రానికి నీవు చనిపోతే మా పరిస్థితి ఏంటి అంటూ బోరున ఏడ్చింది. అమ్మ నీవు ఇంకా బాగా చదివిన. మంచి ఉద్యోగం చేయాలి అని మా అమ్మ చెప్పింది.

మా అమ్మాయి అనుకున్నట్లు గానే నా చదువు బాగా సాగింది. మంచి సమస్త లో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ను బాగా చూసుకుంటున్న. కానీ ఎందుకో మనసులో తెలియని బాధ. నా తల్లిదండ్రులు నా బాధ ను తెలుసుకొని. నా సంతోషం కోసం. పెళ్లి చేసారు. నా జీవితంలో కి వచ్చిన వ్యక్తికి నా గురించి తెలుసు అయినా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నన్ను ఒకరు మోసం చేస్తే నన్ను ప్రేమిచే వాల్లు నా జీవితంలో కి వచ్చారు ఇప్పుడు నాకు చాలా సంతోషం గ ఉంది. మనల్ని మోసం చేసిన వాల్లే వచ్చినట్లు మనల్ని ప్రేమించే వాల్లు కూడా వస్తారు. ఎవరు బాధ పడకండి...


మీ అనుభూతులు మాతో పంచుకోండి

వాట్సాప్ 9542116574

Post a Comment

0 Comments