Ticker

6/recent/ticker-posts

మా ఇద్దరినీ చూసి అందరు భార్యభర్తలు అనుకునే వాళ్ళు

 


మా ఇద్దరినీ చూసి అందరు భార్యభర్తలు అనుకునే వాళ్ళు

 

తను ఏడవ తరగతి నేను తొమ్మిది మా ప్రేమ ప్రయాణం ఎలా ముగిసింది. మిరే చుడండి. నా జూనియర్ తను అంతే కాదు తను ఉండేది మా ఇంటి పక్కనే, నా లక్కీ అదే, ఎందుకంటే ఒకే ఊరు, ఓకే స్కూల్, మా ఇంటి పక్కనే, కానీ మా ప్రేమ మాత్రం ఓడిపోయింది. తను నాతో సరదాగా ఉండేది బాగా ఆడుకునేవాళ్ళం, తను ఎప్పుడు మా ఇంటికి వస్తుఉండేది.అలా మా మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారింది. తను ఎప్పుడు నా గురించి ఆలోచించేది. తను నన్ను ప్రేమించే విషయం చాలా మందికి తెలుసు నాకు తప్పా, ఒకరోజు తన దగ్గర నా వస్తువులు ఉండటం తన ఇంట్లో వాళ్ళు చూసారు అప్పటి నుండి నా బ్యాడ్ టైమ్ మొదలు అయింది. తనని నా నుండి దూరం పెట్టారు.తను, నా పేరు తన పేరు ఫ్లెమ్స్ వేసుకొని చూసింది. ఫ్లెమ్స్ పేపర్ తన బ్యాగ్ లో చూసాను.

తనకి నేను అంటే చాలా ఇష్టం

 తన బ్యాగ్ లో ఫ్లెమ్స్ పేపర్ చూసేవరకు నాకు తెలియదు.తను నాకు దూరం కావడానికి కారణం వాల్ల పిన్ని, తనను కొట్టి నాతో మాట్లాడకుండా చేసింది, తను నాతో ఉన్న క్షణాలు మర్చిపోలేను, మా ఇద్దరినీ చూసి అందరు భార్యభర్తలు అనుకునే వాళ్ళు, జీవితం లో మా ఇద్దరికీ సెత్రువు తన పిన్ని, ప్రతి ఒక్కరి జీవితంలో శేత్రువు ఉన్నట్లే మా జీవితంలో కూడా ఉండి మరి. వాల్ల పిన్ని కారణంగ మేము రెండు సంవత్సరాలు మాట్లాడుకోలేదు, కానీ దేవుడు ఒకరోజు నా ప్రార్ధన స్వికరించాడు, తను నాతో మాట్లాడింది. ఇసారి వాల్ల పిన్నికి అవకాశం ఇవ్వకూడదు అని అనుకున్నాను. అందుకే, ఇంట్లో వాళ్లకు స్నేహితులుకు, ఇంకా ఎవ్వరికి తెలియకుండా మాట్లాడుకోవాలి అనుకున్నాము, మాకు తన చెల్లెలు చాలా బాగా సహాయం చేసింది.

తను నాకు దూరం కావడానికి కారణం


మేము పేద వాళ్ళం అంటే మరి అంత కాదు వాల్ల కంటే తక్కువ ఆస్తులు ఉన్నవాళ్ళము, అందుకే తను నాకు దూరం అయింది. అంతే కాదు అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఆ వయసులో తనని తీసుకోని వెళ్ళితే ఎలా తనను బాగా చూసుకో గలను, అందుకే అంత సాహసం చేయలేక పోయా.తన పెళ్లి వాల్ల మామ తో కాయం చేసారు, తన పెళ్లి ఆపే అంత స్తోమత నాకు లేదు. అలా అని తనని మర్చిపోలేను, చివరికి జీవితం అంటేనే చిరాకు వచ్చింది, చనిపోదాం అనుకున్న, నాకు దైర్యం సరిపోలేదు.తను నన్ను ఎంత ప్రేమిస్తుందో అడగాలి అనిపించి అడిగాను, అప్పుడు తను నా చెంపను  చెల్లు మనిపించింది, ఎందుకంటే, అలా నేను అడిగినందుకు, నీవంటే నాకు పిచ్చిరా, పిచ్చోడా, అంటూ అనింది. ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరకడం నా అదృష్టం కానీ తను నా లైఫ్ లోకి రాలేదు.

తను నాతో అన్నమాట మర్చిపోలేను


నేను చనిపోయే వరకు నిన్ను ప్రేమిస్తాను, నా ప్రాణం నీవు, అని అంది. ఇంకా ఎప్పుడు, నేనంటే నీకు ఇష్టమా అని అడగవద్దు అంది. నన్ను గట్టిగ కౌగిలించుకుంది, నేను ఓకే అమ్మాయిని అలా తాకడం అదే మొదటి సారి, తను చాలా ఏడ్చింది కానీ నేను ఏమి చేయలేను, మన జీవితంలో ఏమి జరగాలి అనుకుంటే అదే జరుగుతుంది విధిని మార్చడం ఎవరి వల్ల కాదు,తనని అలా చూసి తట్టుకోలేక పోయాను నాతో వచ్చేయ్ అన్నాను, కానీ నీతో వచ్చి ఇంట్లో వాళ్ళు అవమానం పడేలా చేయను అనింది.

దేవుడు నా జీవితంలో రాసిన వింత


 అని ఏడ్చుకుంటూ వెళ్ళింది. అప్పుడు నాకు ఎందుకో చాలా బాధగావుంది.నన్ను పెళ్లి చేసుకోక పోయిన నేను తన వాడిని అనే ఫీలింగ్ తనకు కావాలి అని. తన పుట్టినరోజు నాతో బొట్టు పెట్టించుకుంది.

నీవు నా వాడివి అని నా మనసుకు తెలిస్తే చాలు అంది. నీవు బొట్టు పెట్టిన రోజు మన పెళ్లి అయింది, మనం దూరంగా ఉన్నా మన మనసులు మాత్రం దగ్గరగ ఉండాలి అంది. తన మనసు గెలుచుకున్న నేను తనని గెలుచుకోలేక పోయాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీతోనే ఉండటానికి ప్రయత్నం చేస్తాను.మళ్లీజన్మలో అయినా దేవుడు కరుణిస్తే చాలు. మరో జన్మలో అయినా మా ప్రేమను బ్రతికించు దేవుడా,, అని మనసు బరువు తగ్గే వరకు ఏడ్చాను, అంతకుమించి నేను ఏమి చేయలేను.

మన ప్రేమ గెలవడం గెలవక పోవడం మన చేతులో లేదు

మనం కోరే ప్రేమను దేవుడు దూరం చేస్తాడు, మనకు నచ్చని వారిని మన దగ్గరికి చేరుస్తాడు విధి ఆడే వింత నాటకం.

Please Send you're real love stories, you're all information is very secure don't worry to my friends  

Post a Comment

0 Comments