Ticker

6/recent/ticker-posts

పది రూపాయలు కు వైద్యం చేసే మంచి డాక్టర్ గురించి తెలుసుకోండి

 

పది రూపాయలు కు వైద్యం చేసే డాక్టర్ గురించి తెలుసా..?


వైద్యం చేస్తే 10 తీసుకుంటుంది, బెడ్ జాయిన్ అయితే  50 తీసుకుంటుంది. ఇది సినిమాలో కాదు ఒక రియల్ లైఫ్ కథ, ఇలాంటి వీ సినిమాలో చూసాం. అదిరింది మూవీ లో హీరో కేవలం ఒక 5 రూపాయలు కు వైద్యం చేస్తాడు. మంచి పేరు,  గుర్తింపు తెచ్చుకుంటాడు, ఇక్కడ కూడా ఒక అమ్మాయి అలాగే చేస్తుంది. మరి ఆమె గురించి కూడా తెలుసుకోవాలి కదా..,?  ఆమె పేరు డాక్టర్ నూరి పర్వీన్ ఈమెకు పాతిక సంవత్సరాలు కూడా లేవు కానీ సేవ చేయాలి అనే ఆలోచన ఉంది. ఆమె తల్లిదండ్రులు విజయవాడ లో ఉంటారు.పర్వీన్ ఎమ్ బి బీ ఎస్  కోసం కడపకు వచ్చారు.


కడప లో అందరితో చాలా సన్నిహితంగా ఉండే పర్వీన్ అక్కడి వారిని విడిచి వెళ్లలేక పోయింది. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. కడపలో ఉన్నవారికి తన స్థాయి లో వైద్యం చేయాలి అనుకుంది.


దీనికోసం తల్లిదండ్రులు కు దూరంగ ఉండాల్సి వచ్చింది. వైద్యం చేపించుకోవడానికి డబ్బులు లేని పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలి అనుకుంది అందుకే 10 రూపాయలు కు వైద్యం చేస్తుంది పర్వీన్.ఒక క్లినిక్ ని నడుపుతుంది

 అలాగే తన సహాయం మేరకు సేవా కార్యక్రమం లో తను పాల్గొంటున్నారు.పర్వీన్ క్లినిక్  కడపలో పాత బస్టాండ్  సమీపంలో క్లినిక్ ఉంది.తనకంటూ ఒక గుర్తింపు రావడానికి తను ఇలా క్లినిక్ నడుపుతున్నాను అని పర్వీన్ చెప్పింది.


ప్రభుత్వం ఆసుపత్రులు అంతే ప్రజలకు భయ్యం. ప్రైవేట్ ఆసుపత్రులు కు డబ్బులు ఖర్చుపెట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎవరు ఉండకూడదు అని పర్వీన్ అన్నారు.


అంతే కాదు తను ఒక పెద్ద ఆసుపత్రి కట్టించి అక్కడ పేద ప్రజలకు 10 రూపాయలు కు వైద్యం చేయాలి అని ఉంది అని చెప్పారు పర్వీన్.


 నాదగ్గరకు చిన్నపిల్లలు 10 తీసుకోని వచ్చి వైద్యం ఎలా ఉందొ చెప్పండి అని అంటూ ఉంటారు. ఈరోజుల్లో 10 అంటే అంత భారం కాదు. చాలా మంది ప్రజలు  ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వందలు, వేలు, లక్షలు, ఖర్చు పెట్టలేకున్నారు. అంతే కాదు అంత డబ్బులు ఖర్చుపెట్టిన బ్రతుకుతారు అని నమ్మకాలు లేవు.కొందరు మహాను బావులు 10 రూపాయలు కె వైద్యం చేసారు, నేను కూడా అలా వైద్యం చేసి, చరిత్రలో నేను  నిలవాలి అని పర్వీన్ బీబీసీ తో వివరించారు.పర్వీన్ ఏం బీబీఎస్ ని మూడు సంవత్సరాలు క్రితమే పూర్తి చేసారు


 అంతే కాదు ఆమె 104 లో కూడా పనిచేసారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నపుడు తనకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని చెప్పారు.


పర్వీన్ క్లినిక్ మొదలు పెట్టి సంవత్సరం అవుతుంది అని అలాగే ప్రతి నెల అద్దె కడుతు క్లినిక్ నడుపుతున్న అని పర్వీన్ చెప్పుకొచ్చారు. క్లినిక్ మొదలు పెట్టిన కోద్ధి రోజులకే కరోనా మొదలు అయినది అయినా కూడా వైద్యం చేయడం ఆప లేదు అని పర్వీన్ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో జ్వరం, జలుబు అంటూ ఆసుపత్రులు తిరిగిన ఎవరు పట్టించుకోలేదు వెనుకకు పంపించారు, కానీ పర్వీన్ అలా కాదు, అసమయంలో కూడా వైద్యం చేసారు, కరోనా సమయంలో కూడా తనవంతు సాయంగా  ఆహారం లేని వాళ్లకు, రోజుకు 100 మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసింది అని కడపకు చెందిన వైద్యుడు వెంకటసుబ్బయ్య తెలిపారు.


ఆమె ఏంబీబీఎస్ చదవక ముందే సేవా కార్యక్రమం లో చురుగ్గా పాల్గొనేది.


పర్వీన్ ఇప్పటికే రెండు సేవా సంవస్థలు మొదలు పెట్టారు.అంతే కాదు వైద్యం మీద ప్రజలకు అవగాహనా ఉండాలి అని కొన్ని స్ఫూర్తి కార్యక్రమాలు చేసారు పర్వీన్.


పర్వీన్ చేసే సేవలకు సభ్యత్వం కూడా లభించింది. అంతే కాదు, కడపలో ఇఎమ్ఏ  లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు పర్వీన్. పర్వీన్ ముస్లిం కావడంతో చాలా ఇబ్బదులు వచ్చాయ్ అయినా కూడా తను వెనక్కి తగ్గలేదు అని చెప్పారు పర్వీన్.

పర్వీన్ తల్లిదండ్రులు మంచి సేవాగునం కలవారు అంతే కాదు ఇప్పుట్టికి వాళ్ళు 3 ఆనాధలు ను చదివిస్తున్నారు. సేవాగుణం  తన తల్లిదండ్రులు నుండి వచ్చింది అని పర్వీన్ చెప్పారు, తను క్లినిక్ మొదలు పెట్టిన విషయం కూడా చెప్పలేదు వాళ్లే తెలుసుకొని  నాదగ్గరకు వచ్చి చాలా సంతోషించారు.నాదగ్గరకు ప్రతి రోజు జనం చాలా మంది వస్తుంటారు

దాదాపు 100 మంది వస్తారు. ప్రతి రోజు వైద్యం చేస్తాను ఒకవేళ నేను క్లినిక్ లో లేకుంటే నా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు వైద్యం చేస్తారు. ఇక్కడ వైద్యం చేపించుకుంటే 10 రూపాయలు, ఇక్కడే ఉండి  బెడ్ తీసుకోని వైద్యం చేపించుకుంటే బేడ్ కి 50 తీసుకుంటా అని పర్వీన్ చెప్పారు. భవిష్యత్ లో మల్టిస్పెషాలిటీ ఆసుపత్రి పెడితే తక్కువకే వైద్యం చేస్తాను.


Post a Comment

0 Comments