Ticker

6/recent/ticker-posts

6th క్లాస్ నుండి ప్రేమిస్తున్నాను ( నాతో ఒక్కసారి మాట్లాడు చాలు )


6th క్లాస్ నుండి ప్రేమిస్తున్నాను ( నాతో ఒక్కసారి మాట్లాడు చాలు )

 నేను చదివేది 6 వ తరగతి 


కానీ నేను చేసే చేష్టలు మాత్రం 25 సంవత్సరాల వాడిగా చేసేవాడిని. నా ప్రేమ విషయం అందరికి తెలియాలి అలాగే నా లవర్ నాతో ఒక్కసారి మాట్లాడితే చాలు అందుకే నా ప్రేమ గురించి అందరు కాక పోయిన నా లవర్ చదివిన చాలు.

 నా పేరు సంతోష్  నాపేరు లో సంతోషం ఉంది కానీ నా జీవితంలో లేదు, అది ఎలాగో మిరే చుడండి.


నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్న


నేను స్కూల్ లో ఉన్నపుడు ఒక అందమైన అమ్మాయి నీ చూసాను. తన మొఖం చాలా చాలా అందంగా ఉంటుంది. 2007 వ సంవత్సరం లో నా ప్రేమ మొదలైంది, తనని ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించింది తను కూడా మా క్లాస్ నాకు ఒక సార్ ఫెవర్ గ ఉండే వాడు తనే నన్ను లీడర్ గ చేసాడు.

శిల్పా కూడా లీడర్ గ ఉండేది మా సార్ నన్ను ఏమి అనేవాడు కాదు, నేను లీడర్ గ ఉన్నాకూడా తనని చూస్తూ ఉండేవాడిని అంత లా మార్చింది తను . స్కూల్ వదిలిన తర్వాత నేను వాళ్ళ ఇంటి పక్కలకు వెళ్ళేవాడిని అలా ప్రతిరోజు తనని చూస్తూ ఉండేవాడిని. నేను వాల్ల ఇంటి పక్కలకు వెళ్లడం మా నాన్న కు తెలిసింది.


నన్ను వేరే స్కూల్ కి చేరిపించాడు

తన పేరు చెప్పలేదు కదా, శిల్పా తన పేరు, తన పేరు లాగే తను అందగా  ఉంటుంది, వాళ్ళు పేద వారు. తను మాత్రం గవర్నమెంట్ స్కూల్ లోనే ఉండిపోయింది. నేను స్కూల్ మారిన నా బుద్ది మారలేదు. స్కూల్ కి వెళ్లి వచ్చాక వాల్ల ఇంటి పక్కలకు వెళ్ళేవాడిని తనని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడిని కాదు. నేను చేసే ఇ అల్లరిని ప్రేమ అంటారు అని నాకు తెలియదు.


ప్రేమ ఏ వయసులో పుడుతుందో ఎవరికీ తెలియదు, తను మళ్ళీ వేరే స్కూల్ కి వెళ్ళింది కొన్ని రోజులు తనకోసం చాలా ప్రయత్నం చేశాను చివరికి తను ఎక్కడ చదువుతుందో తెలుసుకున్న తను వేరే స్కూల్ చేరింది కానీ ఒక ట్యూషన్ వెళ్లడం తెలుసుకున్న.


పట్టు పట్టి నేను కూడా అదే ట్యూషన్ లో చేరాను


నేను తనకోసం వచ్చినట్లు తనకు తెలుసో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఒక్కసారి కూడా తను నన్ను పట్టించుకోలేదు. తనతో మాట్లాడాలి అని చాలా సార్లు ప్రయత్నం చేశాను. తనతో నా ప్రేమ విషయం చెప్పాలి అని చూసా కానీ నాకు అవకాశం రాలేదు తను ఇంటి దగ్గర ఉంది అని తెలిస్తే చాలు తనకోసం వెళ్ళేవాడిని శిల్పా వాల్ల నాన్న తనని హాస్టల్ లో చేరిపించాడు అని తెలుసుకున్నాను వాల్ల హాస్టల్ దగ్గరకు తనకోసం వెళ్ళాను కానీ.


 ఒక్కసారి కూడా తను నాకు వాల్ల హాస్టల్ దగ్గర కనిపించలేదు

అలా ఉండగా మేము ఇ ఇంటర్ కి వచ్చాము అప్పుడు కూడా తనకోసం వెతకడం ఆపలేదు నేను. మళ్ళీ తను ఇంటర్ చదువుతున్న కాలేజీ దగ్గరికి వెళ్ళేవాడిని తనని చూసి వచ్చేవాడిని ఇలా చాలా సార్లు జరిగింది కానీ ఇప్పుడు కూడా తను నన్ను పట్టించుకోలేదు విధి ఎంత విచిత్రమైనదో చుడండి, నాతో విధి బాగా ఆడుకుంది

నేను అన్ని సార్లు తనకోసం తిరిగినా తనకు అస్సలు తెలియదు. నా మనసులో మాట తనతో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ చెప్పలేక పోయాను . నేను తనని ప్రేమిస్తున్నాను అనే విషయం ఊర్లో తెలిస్తే గొడవలు జరిగితాయి అని బాధ పడేవాడిని. నా ప్రేమ విషయం తనకు చెప్పలేక పోయాను అనే బాధ నాలో ఉండేది.

తన ప్రేమ పోదేవాడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే తను చాలా మంచిది తనతో మాట్లాడాలి అని నాకు అవసరం లేకపోయినా నేను వాల్ల ఇంటికి వెళ్ళేవాడిని ఎందుకంటే అలా ఐనా తనతో మాట్లాడవచ్చు అనే చిన్న ఆశ నాలో ఉండేది కానీ తను మాత్రం నాతో మాట్లాడలేదు.


తనని ప్రేమించిన విషయం తలుచుకుంటే ఇప్పటికి నా మొఖం లో చిరునవ్వు మాయం అవుతుంది.


తనకోసం 2007 సంవత్సరం నుండి 2017 వరకు ఎదురు చూసాను కానీ నా ప్రేమ ఒకే కాలేదు. తను నాకు కనబడితే ఒక్కమాట అడగాలి అని ఉంది అది నన్ను నీవు ఒక్కసారి ఐనా చూసావా..? అని ఎందుకంటే తనకోసం అంత ప్రయత్నం చేసిన తనకి తెలియదు అదే నా దురదృష్టం.


అంతే కాదు తనకు పెళ్ళైపోయింది, తను ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు ఎందుకు చెపుతున్నాను అంతే తను నన్ను గుర్తుపట్టాలి అని చెపుతున్న వాళ్ళ పేర్లు ప్రతిమ, గీత, వీళ్ళు అరవతరగతి ఫ్రెండ్స్ నీవు కనుక ఇది చదివితే  ఒక్కసారి నాతో మాట్లాడు చాలు నిన్ను ఇంకా ఏమి అడగను


సంతోష్ ( పేరు మార్చాము )

మీ ప్రేమసంగతులు మాకు పంపవలసిన [ ఇమెయిల్ ఐడి ] < swathipost964@gmail.com


Post a Comment

0 Comments